ప్రజాశక్తి-ఆలూరు
మండలంలోని పెద్దహోతూరు సర్పంచి జొహరాపురం లక్ష్మన్న (75) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. లక్ష్మన్న 2021వ సంవత్సరంలో టిడిపి మద్దతుతో వైసిపి అభ్యర్థిపై గెలుపొందారు. టిడిపి ఆలూరు ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ సర్పంచి లక్ష్మన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మన్న మృతి టిడిపికి తీరని లోటని కోట్ల సుజాతమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. లక్ష్మన్న మృతదేహానికి టిడిపి మాజీ ఇన్‌ఛార్జీలు వైకుంఠం మల్లికార్జున చౌదరి, వీరభద్ర గౌడ్, వైకుంఠం శివ ప్రసాద్, సొసైటీ మాజీ అధ్యక్షులు సౌమ్యా రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి సులక్షణ రెడ్డి, కాంట్రాక్టర్ భీమప్ప, టిడిపి మండల కన్వీనర్ అశోక్ యాదవ్, ఎంపిటిసి చిన్న యాదవ్ నివాళులర్పించారు. మంత్రి జయరాం సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, నారాయణ స్వామిలు లక్ష్మన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు.
కుటుంబాన్ని పరామర్శిస్తున్న కోట్ల సుజాతమ్మ










