ప్రజాశక్తి - భట్టిప్రోలు
టిడిపి నాయకురాలు పరుచూరి లక్ష్మిశక్తి కుమారి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈమె వేమూరు ఎఎంసి మాజీ డైరెక్టర్ జొన్నలగడ్డ విజయబాబుకు చిన్నమ్మ అవుతారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు.










