Jun 29,2023 20:02

నివాళులర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
సిపిఐ మండల కార్యదర్శి ఎల్లప్ప గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి మంత్రాలయం చేరుకొని ఎల్లప్ప మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంపురం రెడ్డి సోదరుల తరఫున తక్షణ సహాయం కింద రూ.10 వేల నగదును వైసిపి నాయకులు జనార్ధన్‌ రెడ్డి, వెంకటరెడ్డి చేతులమీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు సర్పంచి తెల్లబండ్ల భీమయ్య కూడా ఎల్లప్ప మృతదేహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎల్లప్ప కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఫోన్‌లో భరోసా కల్పించారు. వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, గణదాళం దుల్లయ్య పాల్గొన్నారు.