
కురుమన్న మృతదేహానికి నివాళులర్పిస్తున్న మాజీ జడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి
అనారోగ్యంతో లష్కర్ మృతి
నివాళులర్పించిన మాజీ జడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి
ప్రజాశక్తి - పగిడ్యాల
ఔట్ సోర్స్ కింద లస్కర్ గా నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న కురుమన్న (51) అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన పగిడ్యాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పగిడ్యాల గ్రామానికి చెందిన కురుమన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 7వ తేదీన చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం 11 గంటల సమయాన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పేదల గ్రామానికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న , బాపిరెడ్డి, మద్దిలేటి రెడ్డి, భాస్కర్ రెడ్డి కురుమన్న భౌతిక కయానికి పూలమాల వేసి అర్పించారు.