కమలాపురం : వీరపనాయునిపల్లె మండల కేంద్రంలోని బిసి హాస్టల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న చరణ్ (13) అనే విద్యార్థి సోమవారం ఉదయం మతి చెందాడు. వివరాలు.. పెండ్లిమర్రి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చరణ్ బిసి హాస్టల్ ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి నుంచి అతనికి వాంతులు, విరోచనాలు కావడంతో సోమవారం ఉదయం హాస్టల్ సిబ్బంది 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో చనిపోయాడు. మతదేహాన్ని ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ లేకపోవడంతోనే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతిపై పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే
కడప అర్బన్ : వీరపునాయునిపల్లెలోని ప్రభుత్వ బిసి హాస్టల్‌లో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చరణ్ మృతికి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఆర్.నాయక్, సగిలి రాజేంద్ర ప్రసాద్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం విద్యార్థి మతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పందనలో జాయింట్ కలెక్టర్ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మతి చెందడం దారుణమన్నారు. హాస్టల్ వార్డెన్ ఇన్‌ఛార్జి కావడంతో విద్యార్థుల పర్యవేక్షణ కొరవడిందని చెప్పారు. ఎబిసి డబ్ల్యుఒ పులివెందులలో ఉండడం వల్ల హాస్టల్ తనిఖీలు చేయకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి సమ స్యలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టమైందన్నారు. హాస్టల్‌లో రెగులర్ వార్డెన్ ఉండి ఉంటే విద్యార్థి అనారో గ్యానికి గురైన వెంటనే రాత్రి సమయంలో ఆస్పత్రికి తరలించి ఉంటే అతను బతికేవాడని చెప్పారు. విద్యార్థి మతిపై కలెక్టర్‌తో విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికా రులు, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మతి చెందిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అదిం చాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరి ంచారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాహులు, జిల్లా నాయకులు అజరు, రాజశేఖర్, వర్ధన్ పాల్గొన్నారు










