ప్రజాశక్తి - ముసునూరు
అనారోగ్యంతో బాధపడుతున్న పేద మహిళకు తెలుగు యువత మండల నాయకులు పాకనాటి సీతారామ్ ఆర్థిక సాయం అందించారు. మండలంలోని ముసునూరు గ్రామానికి చెందిన చింతా నాగరాజు భార్య తీవ్ర అనారోగ్యం బాధ పడుతోంది. విషయం తెలుసుకున్న సీతారామ్ ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నూజివీడు నియోజకవర్గ బిసి నాయకులు నకా యోహాను పాల్గొన్నారు.










