ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
గత మూడేళ్లుగా పక్షవాతం, గుండె జబ్బుతో బాధ పడుతున్న అనారోగ్య బాధితునికి నారా లోకేష్ సేవ సమితి అధ్యక్షులు, టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు సాయం అందించి ఔదార్యం చాటుకున్నారు. మం డలంలోని జొన్నవారి గుడెంలో టిడిపి సీనియర్ కార్యకర్త బొంతు ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ కుటుంబానికి ఆకుమర్తి రామారావు రూ.పది వేల ఆర్థిక సాయం అందించారు.










