
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లు 18వ వార్డులో గల్ఫ్ గృహ కార్మికుల హెల్పింగ్ హాండ్స్, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కటకం వెంకట కల్యాణ్ గుప్తాకు రూ.45 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఇతనికి చిన్న వయసులోనే బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఈ విషయాన్ని ఫౌండేషన్ ట్రెజరర్ బొందా ప్రభావతి దృష్టికి తీసుకెళ్లారు. కల్యాణ్‌కు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కమిటీ పెద్దలను బొంద పద్మావతి కోరడంతో ప్రభావతి ఫౌండేషన్ తరపున రూ.10 వేలు, ప్రభావతి, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కలిసి రూ.35 వేలు, మొత్తం రూ.45 వేల ఆర్థిక సహాయాన్ని వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ చేతులమీదుగా అందించారు. బొంద పార్థసా రథి మనవడు సర్వేశ్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లు శాస్త్రి చిల్డ్రన్స్ హోంలో కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు, ఖండవల్లి వాసు, కొండేటి రావు, మధు పాల్గొన్నారు.