ప్రజాశక్తి - ఉంగుటూరు
మండలంలోని ఉప్పాకపాడు పాఠశాల ఉపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అల్లు శ్రీను, నాగమణి దంపతులు, కుమార్తె పూజిత గురువారం సాయిబాబా గుడి వద్ద తాడేపల్లిగూడెంలో అనాధలకు 55 దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పారితోషికం రూ.20 వేలులో సుమారు రూ.10 వేలు విలువగల 55 దుప్పట్లు నిరుపేదలకు, అనాధలకు పంపిణీ చేశారు.










