Oct 24,2023 19:39

అభిమానులతో మణికంఠ సెల్పీ

ప్రజాశక్తి - భోగాపురం: ఈ ప్రాంతంలో అనాధ పిల్లలు ఉంటే దత్తత తీసుకొని వారి పూర్తి బాధ్య తలు తానే తీసుకుంటానని ఢి డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ విజేత డాన్స్‌ మాస్టర్‌ మణికంఠ అన్నారు. భోగాపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ బొమ్మ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం డాన్స్‌ ప్రోగ్రాం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఢ డ్యాన్స్‌ ప్రోగ్రాం విజేతలు మణికంఠతో పాటు కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ మీ ఏరియాలో అనాధ పిల్లలు, పేదరికంలో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడే విద్యార్థులు, మేజర్‌ ఆపరేషన్‌ చేయలేక ఇబ్బంది పడుతున్న చిన్నారులను ఆదుకుం టానని ఆయన అన్నారు. అందుకు ఎవరైనా అలాంటి వారు ఉంటే ఎస్‌ఎస్‌టి ఈవెంట్స్‌ లక్కీ, జోగేంద్ర, సిద్దార్థ్‌కు చెందిన ఈ ఫోన్‌ నెంబర్లు 9652408842, 8520995511ను సంప్రదించాలన్నారు. ఏ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కి వెళ్లినా అక్కడ వచ్చిన ఆదాయంలో 20 శాతం పేదలకు ఖర్చు చేస్తు న్నానని అన్నారు. అంతకుముందు మణికంఠ, కావ్య వివిధ పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.