Jun 10,2023 21:22

పోస్టర్లను విడుదల చేస్తున్న పద్మావతి హైస్కూల్‌ డైరెక్టర్‌ ఆశ తదితరులు

అనాధ పేద విద్యార్థులకు ఉచిత విద్య
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

      ఆత్మకూరు పట్టణంలోని పద్మావతి హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరం నుండి అనాధ పిల్లలకు, పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్‌తో పాటు ఉచిత విద్యను అందిస్తున్నట్లు పాఠశాల డైరెక్టర్‌ ఆశ తెలిపారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని పద్మావతి హైస్కూల్‌లో ఉచిత విద్య, అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను పాఠశాల డైరెక్టర్‌ ఆశ ఉపాధ్యాయులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్నేహా స్టడీ సర్కిల్‌ వారి సహకారంతో 2023-24 విద్యా సంవత్సరం సంబంధించి పాఠశాలలో ఉచిత విద్యను అందించేందుకు ముందుకు వచ్చామన్నారు. పద్మావతి హైస్కూల్‌ 1984లో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు అనేకమందికి సామాజిక దృక్పథంతో విద్యాబోధన చేస్తున్నారని, ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. వెనకబడ్డ ఆత్మకూరు లాంటి ప్రాంతంలో అనాధ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు తమ పాఠశాల ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అనాధ విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.