హీల్ ప్యారడైజ్‌ను సందర్శించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
అనాధ బాలలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉచిత విద్య, వైద్యం, అందించడం ఎంతో అభినందనీయమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో ఉన్న హీల్ (హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్) ప్యారడైజ్‌ను సందర్శించి అక్కడ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించడంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, తహశీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు, హీల్ కార్యదర్శి టి.లక్ష్మి, సిఇఒ కె.అజరుకుమార్, ప్రిన్సిపల్ బి.సాయిబాబు, ఉపాధ్యక్షులు జిడివి.ప్రసాదరావు, డైరెక్టర్లు ధనప్రకాష్, ఎం.రంగారావు, వైఎ.చౌదరి, రామచంద్రరావు, నూజివీడు రూరల్ సిఐ ఆర్.అంకబాబు, ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్.చంటిబాబు, హీల్ సిబ్బంది పాల్గొన్నారు.










