Aug 09,2023 20:56

మాట్లాడుతున్న డిఎస్‌పి వంశీధర్‌గౌడ్‌

పోరుమామిళ్ల : ఇటీవల పట ్టణంలో జరిగిన బం గారు చోరీ కేసును చేధించి, నలుగురు దొంగలను అదు పులోకి తీసుకొని వారి నుంచి తొమ్మి ది తులాలు బంగారు, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌గౌడ్‌ పేర్కొన్నారు. కేసు సిఐ సురేష్‌రెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో చేధించారని తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్‌పి మాట్లాడుతూ పట్టణంలోని పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నె పల్లె గ్రామ సమీపంలో అనుమాస్పదంగా ద్విచక్ర వాహనంలో తిరు గుతున్న నలుగురిని పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుండి బం గారు వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అనం తరం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. నలుగురి నింది తులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో దొంగతనాలు చేశారని, ఆయా పోలీస్‌స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు.