Sep 25,2023 22:11

ప్రజాశక్తి - పోలవరం
            అంతర్‌ జిల్లాల అండర్‌-17 బాలుర విభాగంలో రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపాల కల్యాణ్‌బాబు కాంస్య పతకాన్ని సాధించాడు. ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ నున్నా విద్యాసంస్థల ఆవరణలో నున్నా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆధ్యర్యంలో మూడు రోజుల పాటు 67వ స్కూల్‌ గేమ్స్‌ అంతర్‌ జిల్లాల అండర్‌ 17 బాలుర విభాగంలో రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించారు. కాంస్య పతకాన్ని సాధించిన కల్యాణ్‌బాబును పాఠశాల యాజమాన్యం సోమవారం అభినందించింది. ఇన్‌ఛార్జి ఎంఇఒ, ప్రధానోపాధ్యాయురాలు ఎల్‌.మణి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించడం హర్షణీయమన్నారు.