
ప్రజాశక్తి - కొత్తవలస : బంగ్లాదేశ్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించింది. భారత్ నుంచి పాల్గొన్న ములపర్తి ప్రకాష్ రావు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారత్‌కు కాంశ్య పతకం సాధించి పెట్టాడు. మండల ంలోని కంటకాపల్లి గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబంలో జన్మించిన ఈయన పతకం సాధించడం గొప్ప విషయం. ప్రకాష్‌రావు సెమీ ఫైనల్‌లో నేపాల్ ప్లేయర్‌తో పోటీ పడి ఓటమి పొంది కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పతకం సాధించిన ప్రకాశ్‌రావును పలువురు అభినందిస్తున్నారు.
26న బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
శృంగవరపుకోట: ఈ నెల 26వ తేదీన ఎస్ కోట వైజాగ్ రోడ్‌లో పుణ్యగిరి కాలేజ్ ఎదురుగా ఉన్న సిరికి రిసార్ట్స్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 బాలురు, బాలికల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను నిర్వహించనున్నామని మండల క్రీడా కోఆర్డినేటర్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఆదివారం సిరికి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో ఉండే 9 నియోజకవర్గాల నుండి 180 మంది బాలురు, బాలికలు వస్తున్నారని వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడా కారులు త్వరలో విశాఖపట్నంలో జరగబోవు రాష్ట్ర స్థాయి స్కూల్స్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. ఈ ఎంపిక పోటీలకు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్న సిరికి రిసార్ట్స్ యాజమాన్యం చిత్రగుప్తకి ధన్యవాదాలు తెలియజేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు గురువారం ఉదయం 9గంటల కల్లా హాజరు కావా లని, క్రీడాకారులు క్రీడా దుస్తులతో, షూష్, బ్యాట్స్, షటిల్ కాక్స్, ఎవరివి వారే తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలు కోసం 7989199534, 9490265104 నెంబర్లను సంప్రదించాల్నఆ్నరు.