
ప్రజాశక్తి - తణుకు రూరల్
అంతర్జాతీయ చిత్ర కళా పోటీల్లో తణుకు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బంగారు, వెండి పతకాలు సాధించారు. ఇటీవల హైదరాబాద్ ఎంగ్‌ఎన్వాయిస్ ఇంటర్నేషనల్ వారు ఈ పోటీలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు ఉత్సవంలో భాగంగా నిర్వహించిన బాలల చిత్రకళా పోటీల్లో జెడ్‌పి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, స్వాతంత్ర సమర ఘట్టాలు చిత్రీంచారు. విద్యార్థులు బంగారు పతకాలు, జ్యూరీ హానర్ ప్రైస్‌లు పొందారని తెలిపారు. ఎస్.సోనియా, బి.పూజ్యలక్ష్మి, కె.మేఘనరాధ, పి.హేమంత్‌గణ, సిహెచ్.చరణ్, ఎస్‌ఎల్.నరసింహ, బి.శ్రీహిత, కె.విద్యాహాసిని, జి.యశోధకృష్ణ, జెజె.అఖిల్ హనుమంత కుమార్, పి.శృతి, పి.రాంప్రసాద్, కె.తన్మయిప్రియ, ఎన్.ఖ్యాతిక, ఒ.కనకమహాలక్ష్మి, బి.నందిని బంగారు పతకాలు సాధించారని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, చిత్రకళ ఉపాధ్యాయులుకు జ్ఞాన సుధా పురస్కార్ పేరుతో జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించారని తెలిపారు. అంతర్జాతీయ చిత్రకళా పోటీల్లో విశేష ప్రతిభతో అవార్డులు సాధించిన విద్యార్థులను, చిత్రికళ ఉపాధ్యాయుడు డాక్టర్ వెంపటాపును ప్రధానోపాధ్యాయులు కె.పద్మావతి, జిజె.ప్రభువరం, కనకదుర్గేశ్వరి, శైలజ, వీరభద్రం, పెద్దిరాజు, అక్కింసెట్టి రాంబాబు, వెంకటరాజు, కోటయ్య, పాపారావు, రాధ, షీలా, సురేంద్ర అభినందించారు.