Aug 23,2023 23:17

తేజేశ్వర్‌ను అభినందిస్తున్న కలెక్టర్‌, తదితరులు

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : ఖగోళ శాస్త్రంపై పోలాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో బంగారు పతకం సాధించిన కోడూరు తేజేశ్వర్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు నిర్వహించడం ద్వారా దేశం గర్వపడే శాస్త్రవేత్తగా తేజేశ్వర్‌ రాణించాలని జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు ఆకాంక్షించారు. పోలాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్‌లో బంగారు పతకం సాధించిన కోడూరు తేజేశ్వర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు నగరంలోని బందర్‌ రోడ్‌లో గల ఫిట్‌జీ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో బంగారు పతకాన్ని అందుకోవడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ వత్తిలో పనిచేస్తున్న కోడూరు శేఖర్‌ కష్ణవేణి దంపతులకు జన్మించిన తేజేశ్వర్‌ విద్యలో రాణిస్తూ ఫిట్‌జీ కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన గోల్డెన్‌ ఐ మార్గదర్శకత్వం మద్దతు కార్యక్రమం ద్వారా తేజేశ్వర్‌ తన విజయప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఖగోళ శాస్త్రంలో మొదటి దశలో ఇంటర్నేషనల్‌ ఒలింపియాడ్‌ కు క్వాలిఫై అయి ముంబాయిలో నిర్వహించిన ఓరియెంటేషన్‌ కం సెలక్షన్‌ క్యాంపులో విజయం సాధించి అంతర్జాతీయ ఒలింపియాడ్‌కు ఎంపిక అయ్యారన్నారు. ఒలింపియాడ్‌లో 50 దేశాలు పాల్గొనగా మనదేశం నాలుగు బంగారు పతకాలను ఒక వెండి పతకాన్ని సాధించడం జరిగిందన్నారు. బంగారు పతకం సాధించిన తేజేశ్వర్‌ మనరాష్ట్రానికి చెందినవారు కావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో తేజేశ్వర్‌ మరిన్ని విజయాలను సాధించి అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తగా రాణించాలని డిల్లీరావు కోరారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీత కె.తేజేశ్వర్‌ ఫిట్‌ జీ కళాశాల డైరెక్టర్‌ పి.రమేష్‌ బాబు, ప్రిన్సిపాల్‌ సంపత్‌, హెచ్‌ఒడిలు ఎల్‌.పవన్‌, సిహెచ్‌.సాయి రామ్‌, గోపీ కష్ణ, శివరామ కష్ణ, తేజేశ్వర్‌ తల్లితండ్రులు కె.శేఖర్‌, కె.కష్ణవేణి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.