తాడేపల్లి రూరల్: కెఎల్ యు డీమ్డ్ యూనివర్శిటీలో ఐదురోజుల అంత ర్జాతీయ కార్యశాలను సోమవారం ఘనంగా ప్రారంభిం చారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాస్, మైసూర్ జెెఎస్‌ఎస్ మెడికల్ కళాశాల ఆచార్యులు డాక్టర్ టిఎస్‌ఎస్ రావు, బెంగళూరులోని నిమ్ హాన్స్ మానవ మెదడు బ్యాంక్ డాక్టర్ అనితా మహదేవన్, హనుమ శ్రీనివాసరెడ్డి భవనం లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్దుల నుద్దే శించి ప్రసంగించారు. మానవ మెదడులాగా పనిచేసే విధంగా మథర్ బోర్డు రూపకల్పనకు ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్దమయిందని శ్రీనివాస్ అన్నారు. కెఎల్ వర్శిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు మాట్లాడుతూ కృత్రిమ మేథస్సుతో మానవ మెదడులో తలెత్తే సమస్య లకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రపంచస్థాయిలో జరుగుతున్న పరిశోధనలు సత్పలితాలను అందిస్తున్నాయ న్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ కు, బెంగళూరులోని నిమ్ హాన్స్ మానవ మెదడు బ్యాంక్ డాక్టర్ అనితా మహదేవన్, , మైసూర్ జెఎస్‌ఎస్ మెడికల్ కళాశాల ఆచార్యులు డాక్టర్ టిఎస్‌ఎస్ రావు, డాక్టర్ మురళీధర్ హెగ్డే, జపాన్ కు చెందిన శామ్యూల్ జెకె అబ్రహాం,డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి.వి, హనుమ శ్రీనివాసరెడ్డి భవనం లకు, సర్ సివి రామన్ అవార్డులను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.










