ప్రజాశక్తి-సీతమ్మధార : అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో విశాఖ కీర్తి విశ్వవిఖ్యాతం అవుతోందని ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు అన్నారు వచ్చేఏడాది ఫిబ్రవరి 9 నుంచి 12వ తేదీ వరకు నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌ను విజయవంతం చేయాలని కోరారు. బుధవారం సింధూర ఫంక్షన్ హాల్‌లో మీడియాతో సినీ నటుడు, కరాటే క్రీడాకారుడు సుమన్ ఆత్మరక్షణకు దోహదపడే కరాటేను ఆదరించాలని కోరారు. విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖలో అంతర్జాతీయ కరాటే పోటీలు నిర్వహించడం గర్వకారణమని, దీనికి అవసరమైన సహకారాన్ని విజెఎఫ్ ద్వారా అందిస్తామన్నారు. కార్యక్రమంలో షియాన్ అనంతన్, మాజీ డిప్యూటీ మేయర్ సత్యనారాయణ, వైసిపి నాయకుడు ఆళ్ల శివగణేశ్, ఆర్గనైజంగ్ కమిటీ చీఫ్ ఆర్గనైజర్ ఎస్‌పిఎండి నాయుడు, సభ్యులు ఎస్‌్ కిశోర్ , కె హేమంత్, టి ఈశ్వరరావు పాల్గొన్నారు.










