Nov 03,2023 23:44

విద్యార్ధులను అభినందిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-పెద్దదోర్నాల
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న రామావత్‌ గోపీనాయక్‌ మెఘావత్‌ మల్లేశ్వరనాయక్‌ యం విజయలక్ష్మీ, డి ఖాజాబీ అనే విద్యార్ధులు జాతీయ స్థాయి రోప్‌ జంప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి, అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. స్వర్ణం, రజితం, కాంస్య పతకం కైవసం చేసుకుని అంతర్జాతీయ స్థాయి జంప్‌ రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. గత నెల 15, 16, 17వ తేదీలలో గుంటూరు జిల్లా తెనాలి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానంలో నిలిచినట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్‌వి నారాయణరెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 16 నుంచి 20వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆర్‌ గోపి నాయక్‌ పాల్గొంటారని చెప్పారు. దాతలు చేయూత నిచ్చి సహకరించాని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్స్‌ పి రామా నాయక్‌, హెచ్‌ రామా నాయక్‌, స్టాఫ్‌ సెక్రటరీ వి నాగమూర్తి, విజయ మాణిక్యం, అనసూయ దేవి, కిరణ్‌ కుమార్‌, పోలయ్య, మీటే నాయక్‌, శివ కుమారి, యోగా మాస్టర్స్‌ ఎ మహేర్వర్‌ రెడ్డి, పి ప్రేమ్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు.