Jan 03,2023 00:09

ప్రశంసాపత్రాలు చూపుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
కోనసీమ చిత్రకళా పరిషత్‌ ఆధ్వర్యాన అమలాపురంలో ఇటీవల నిర్వహించిన 33వ అంతర్జాతీయ బాలల చిత్రలేఖనం పోటీల్లో రాజవొమ్మంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. ఈ పాఠశాల విద్యార్థులు పూర్ణిమ మహేశ్వరి, లోవకుమారి, గంగాధర్‌, హారిక, లక్ష్మణ్‌, పుష్పసాయి, బేబీ బంగారు పతకాలు, మరో 44 మంది విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచి కెసిపి మెరిట్‌ అవార్డులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, చిత్రలేఖనంలో మంచి తర్ఫీదు ఇచ్చిన డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడు ఎం.కొండబాబును సోమవారం పాఠశాల హెచ్‌ఎం పి.శ్రీనివాసరావ ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిఎంసి చైర్మన్‌ సిహెచ్‌.వీరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.