Aug 22,2023 22:12

సిల్వర్‌ పతకం సాధించిన పైడిరాజు

ప్రజాశక్తి - సాలూరు : ఈనెల 19 నుంచి 21 వరకు శ్రీలంక దియాగమలో నిర్వహించిన అంతర్జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పాల్గొన్న కనకల పైడిరాజుకు సిల్వర్‌ మెడల్‌ లభించింది. మండలంలో మామిడి పల్లికి చెందిన పైడిరాజు వివాహమైనా అథ్లెటిక్స్‌పై ఆసక్తితో ప్రాక్టీస్‌ చేస్తూ పతకాలు సాధిస్తున్నారు. దేశీయంగా జరిగిన అనేక పోటీల్లో కూడా ఆమె పతకాలు సాధించారు. 35వ విభాగంలో పాల్గొన్న పైడిరాజు సిల్వర్‌ మెడల్‌ సాధించారు. పైడిరాజు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమె ప్రయాణ ఖర్చుల నిమిత్తం డిప్యూటీ సీఎం రాజన్నదొరతో పాటు కొంత మంది ఆమెకు ఆర్థికసాయం చేశారు. ఆమె గీతం మెడికల్‌ కళాశాలలో ఎఎన్‌ఎంగా పని చేస్తున్నారు. ఆమెలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి గీతం కళాశాల యాజమాన్యం కూడా సహకరించింది.