అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలకు డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ వర్శిటీ జట్టు ఎంపిక
ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: ఈ నెల 23 నుండి మార్చి 3వ తేదీ వరకు బెంగుళూరులోని రీవా యూనివర్శిటీలో జరుగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జట్టును ఎంపికచేసినట్లు వర్శిటీ స్పోర్ట్సు బోర్డు సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వర్శిటీ జట్టు వివరాలు తెలిపారు.
జి.శివనిరంజన్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల), సిహెచ్. నితిక్, డి.నిఖిల్ (డాక్టర్ ఫిన్నమనేని సిద్దార్ద మెడికల్ కళాశాల), కె.ఎ.సాయి కిరణ్ (కర్నూలు మెడికల్ కళాశాల), పి.ధనుంజరు నాయుడు (ఆశ్రమ్ మెడికల్ కళాశాల), డి.అశ్వనాథ్ (నారాయణ మెడికల్ కళాశాల), షేక్ అహ్మద్ బాబుల్ (రంగరాయ మెడికల్ కళాశాల), పి.సునీల్‌కుమార్, షేక్ గంజే కుతుమ్ (జిఎస్‌ఎల్ మెడికల్ కళాశాల), ఎన్.నితిన్, పి.ఎన్.వి.కౌషిక్ (సిద్దార్ద మెడికల్ కళాశాల), జి.రాకేష్ చౌదరి (గ్రేట్ ఈస్ట్రన్ మెడికల్ స్కూల్స్), కె.ఆదిత్య (పిఇఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల), ఆర్.పూర్ణచందర్ (ఆంధ్రా మెడికల్ కళాశాల), టి.శివాజి (గవర్నమెంట్ డెంటల్ కళాశాల - కడప), కె.వెంకట ఉదరు కుమార్ (ఎన్‌ఆర్‌ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ) ఎంపికయ్యారు. జట్టుకు కోచ్‌గా తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రావణ, నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జె.శివాజీ బాబు మేనేజర్‌గా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన జట్టును వర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి అభినందించారు.










