ప్రజాశక్తి -పిఎం పాలెం : పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే 6వ ఆంధ్రప్రదేశ్ యూత్ అంతర్ జిల్లా బాలబాలికల బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే విశాఖపట్నం జిల్లా జట్లను జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి, కార్యదర్శి జి.భూషణరావు, సభ్యులు కెవి.బాలకృష్ణ, సిఐ వి.దొరబాబు ఆధ్వర్యాన సోమవారం చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రకటించారు.
బాలుర జట్టు : ఎం.హర్ష, కె.రిథిల్, కె.మహేష్, కె.తేజేష్, ఓ.నికిల్, వి.అభిరామ్, నకుల్ కుమార్, ఎం.ప్రశాంత్, ఆశిష్, ఎంవి.సామ్ సాథివిక్, సిద్ధార్ధ, జి.సింహాద్రి ఎంపికయ్యారు. వీరికి కోచ్‌గా పి.జగదీష్ వ్యవహరించనున్నారు.
బాలికల జట్టు : ఎన్.కల్యాణి, కె.పావని, మాధురిప్రియ, ఆర్.భావన, బి.తేజాంబిక, పి.ప్రవల్లిక, వి.సునీత, ఎస్.చంద్రిక, దీక్షితనాయుడు, వై.రహిత, బి.యాషిక, కెవి.సమ్యమాన ఎంపికయ్యారు. వీరికి కోచ్‌గా ఆర్.సునీల్ రెడ్డి, మేనేజర్‌గా పూజలను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ మహంతి అభినందనలు తెలిపారు.










