ప్రజాశక్తి -కొయ్యూరు
మండలంలోని అంతాడ గ్రామ సచివాలయ పరిధిలోని అంతాడ, తాటిమానుపాలెం, మునసల, దోమలగొంది, కొత్తపల్లి, రాతిమామిడి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి నిర్వహించారు. మొత్తం 336 గడపలకు భాగ్యలక్ష్మి వెళ్లి వారితో మాట్లాడారు. ఎవరైనా అర్హత ఉండి ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాలు పొందని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, స్థానిక సర్పంచులు సుర్ల చందర్రావు, కురుజు పెంటమ్మ, వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, వైసిపి మండల అధ్యక్షుడు జల్లి బాబులు, పిఎసిఎస్ చైర్మన్ అప్పన గజ్జయ్యదొర, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముడిలినాయుడు, పంచాయితీరాజ్ డిఇ నరేన్ కుమార్, ఎంపిడిఓ మేరీ రోజీ, ఎఇ సిహెచ్.రామకృష్ణ, ఎంఇఓ బోడం నాయుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










