
నగదు బహుమతి అందిస్తున్న డిపిటిఒ అప్పలనారాయణ
ప్రజాశక్తి-శృంగవరపుకోట : ఆర్‌టిసి పట్ల సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్.అప్పలనారాయణ సూచించారు. గురువారం పట్టణంలోని ఆర్‌టిసి డిపోలో ఆయన తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని సెక్షన్లు తనిఖీ చేసి, డిపో అభివృద్ధికి తగు సూచనలిచ్చారు. అనంతరం డిపో మేనేజర్ కె.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బందికి ఏర్పాటు చేసిన అభినందన సభలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్లు, డ్రైవర్లకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్.కృష్ణారావు, సూపరింటెండెంట్ వెంకటరావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ వేణు, తదితరులు పాల్గొన్నారు.