ఆగిరిపల్లి:అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు ఎల్లప్పుడూ ప్రజల్ల్లో గుర్తింపు ఉంటుందని యుటిఎఫ్ ఆగిరిపల్లి మండల ప్రధానకార్యదర్శి జె.జ్ఞానసుందరం అన్నారు. మండల పరిధిలోని అమ్మవారిగూడెం ఎంపిపి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పదేళ్లు పనిచేసి ఇటీవల బదిలీ అయిన కోకా జయలక్ష్మీని యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు అజరయ్య, కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంజనీదేవి, ఉపాధ్యాయులు అపర్ణ, వంశీ విశిష్ట పాల్గొన్నారు.










