Sep 30,2023 00:22

ఈపూరు: విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసే ఉపా ధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుం దని ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు అన్నారు. మండలంలోని బొగ్గరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు పొందిన సిహెచ్‌ వీరప్పయ్య అభినందన సభ శుక్రవార జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యా ర్థులను చైతన్య పరచడంలో వీరప్పయ్యది ప్రత్యేక స్థానం అని అన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడుగా మంచి పుస్త కాలు రచించడంతోపాటు ఎస్‌ఇఆర్టిలో పని చేశారని నిరం తరం విద్యార్థుల బాగు కోసం పనిచేసే గొప్ప వ్యక్తి వీర ప్పయ్య అన్నారు. బొగ్గరం జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల అభివద్ధికి కృషి చేశారన్నారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్‌ పోటీలలో విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉండేలా తీర్చిదిద్దా రన్నారు. కరోనా తర్వాత విద్యార్థులలో అనేక మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు మరింత కష్టపడాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాల కోసం అదనంగా పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారని వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఉంటారని వారి విద్యా భివృద్ధికి అహర్నిశలు శ్రమించాలన్నారు. సాంకేతికతను ఆహ్వానించాలని విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం మంచిదే అయినప్పటికీ, అందులో బైజుస్‌ కంటెంట్‌ ఉంచడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాకూడదని యునెస్కో వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న పూర్వ విద్యార్థులను సభలో వక్తలు కొని యాడారు. అనంతరం లక్ష్మణరావు, ఉపాధ్యాయులతో కలిసి వీరప్పయ్య దంపతులను సన్మానించారు.
కార్యక్రమంలో ఎంఇఒలు కె బాబురెడ్డి, రామ తులసి,ఎస్సిఆర్టి సభ్యులు గౌస్‌ బాషా, ప్రధానో పాధ్యాయులు ఆర్‌ గోవింద రాజులు, ఎం. రామకృష్ణారెడ్డి , సాంబ నాయక్‌, విజయ భాస్కర్‌, సుభాని,డేవిడ్‌, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.