Nov 15,2023 00:12

అంజాద్‌ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

అంజాద్‌ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఎస్వీ యూనివర్సిటీ ఉర్దూ విభాగం గెస్ట్‌ లెక్చరర్‌ అంజద్‌ అలీ ఖాన్‌ దక్కించుకున్నారు. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా జాతీయ ఉద్ధోదిన పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన అవార్డులలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ చెందిన అంజాద్‌ ఆలీ ఈ అవార్డును కైవాసం చేసుకున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయన్ని అభినందించారు.