Aug 10,2023 00:00

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

ప్రజాశక్తి - వినుకొండ : 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించారనే విపక్షాల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరక స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. 175 ఎకరాల ముల్బురి ఆగ్రో టెక్‌ వారి వద్ద ఉందని, ప్రభుత్వ భూమి అంగుళమైన తన ఆక్రమణలో ఉందని నిరూపిస్తే తిరిగి ఇస్తానని చెప్పారు. పంట కాల్వలు ఆక్రమించి జరిగిన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వినుకొండలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేసి నాబార్డు అధికారులతో సమీక్షించామని, హాస్పిటల్‌ నిర్మాణానికి నాబార్డు ముందుకు వచ్చిందని, త్వరలోనే నిర్మాణం జరుగుతుందని చెప్పారు. లోకేష్‌ను తనపై పోటీ చేయాలనడంలో తప్పేముందని అన్నారు.