Jun 15,2023 16:42

ప్రజాశక్తి - పిచ్చాటూరు(తిరుపతి) : అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురువారం శిశు సంక్షేమ శాఖ కార్యాలయము నందు ధర్నాలులోముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా నాయకులు దాసరి జనార్ధన్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనార్ధన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి వర్కర్లకు పని భారం పెంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో తమ విధులు నిర్వహిస్తూ గ్రామంలోని బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తూ, నిత్యం ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు అన్నిటిని తూ.చా తప్పకుండా అమలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు తక్కువ వేతనాలు ఇస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నదని విమర్శించారు.తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రిటైర్మెంట్ తర్వాత జీవితంలో సగం పింఛను రూపంలో ఇవ్వాలని, అంగన్వాడి కేంద్రాలు సరఫరా చేసే ఫుడ్డు నాణ్యతగా ఉండాలని, హెల్పర్లకు వేతనాలు పెంచాలని, మినీ వర్కర్లను కూడా రెగ్యులర్ చేయాలని, రాజకీయ వేధింపులు మానాలని, అర్హత కలిగిన హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్ కల్పించాలని, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని శోభారాణికి వినతిపత్రాన్ని పిచ్చాటూరు ప్రాజెక్టు నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరి, కృష్ణవేణి, శ్రీవాణిలో,నాగభూషణమ్మ, సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కేవీబి పురం మండల కార్యదర్శి నాగలాపురం నాగరాజు, నాగలాపురం మండల కార్యదర్శి ఆర్ మురుగేషన్, నారాయణవనం మండల కార్యదర్శి ముని శంకర్, అంగన్వాడి వర్కర్లు కేవీబి పురం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాలలోని వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.