Dec 09,2022 23:41

ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

ప్రజాశక్తి-అడ్డతీగల
అంగన్వాడీ కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలని కోరుతూ స్థానిక సిడిపిఓ కార్యాలయం వద్ద అడ్డతీగల, వై.రామవరం మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల ఒత్తిడితో టెన్షన్‌కు గురైన మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ప్రాజెక్టులోని మృతి చెందిన అంగన్వాడీకు ప్రగాఢ సంతాపం తెలియజేసి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సిడిపిఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్‌ అడ్డతీగల ప్రాజెక్టు అధ్యక్షురాలు బేబీ, జిల్లా కార్యదర్శి బి.నిర్మల మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అనేక రూపాల్లో సేవలు అందిస్తున్న అంగన్వాడీలపై వేధింపులు సరికాదని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించి నెల వచ్చేసరికి కేంద్రాల అద్దెలు, వంట సామగ్రి, కూరగాయలు ఇలా అన్నింటికీ పెట్టుబడులు పెడుతూ కేంద్రాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి జీతం కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొందన్నారు. ఎంఎస్‌కె విజిట్లు, వాలంటీర్‌ విజిట్లు, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, సిడిపివోలు విజిట్లు ఇలా ప్రతి ఒకరూ విజిస్టుల చేస్తూ అంగన్వాడీలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎవరు తనిఖీకి వస్తారో అని టెన్షన్‌కు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు.