ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె ప్రాజెక్ట్ పరిదిలో భ్రట్టిపోలు మండలం అంగన్‌వాడీ హెల్పర్‌కు ఐసిడిఎస్ అధికారులు ఇచ్చిన మెమో ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్లు ఉందని, హెల్పర్‌పై ఒత్తిళ్లు ఆపాలని ఐసిడిఎస్ రేపల్లె ప్రాజెక్టు సిడిపిఓ ఎస్ మాణిక్యంకు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ తరఫున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ చిన్న ఉద్యోగులుగా ఉన్న అంగన్‌వాడీ హెల్పర్‌పై అధికారులు ఉద్దేశపూర్వకంగా సంబంధంలేని అంశాలపై మెమో ఇచ్చి వివరణ అడగటం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నారని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం పనిచేస్తున్న వారిపై మెమోల పేరుతో వేధింపులు తగవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ, సీఐటియూ భ్రట్టిప్రోలు మండల కార్యదర్శి జీ సుధాకర్ పాల్గొన్నారు.










