అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : సిఐటియు
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్
అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కే. భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయం నందు గురువారం నాడు అంగన్వాడీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత మదర్ బి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కే భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలనీ, ఉద్యోగ భద్రత, కనీస వేతనం పెన్షన్, పిఎఫ్, ఈఎస్‌ఐ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనముతో కూడిన మెడికల్ లీవ్, 300 జనాభా దాటిన మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లుగా మార్చాలనీ, వర్క్‌తో సమానంగా వేతనాలు, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచి, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 నుండి పెండింగ్లోని బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని, బీమా అమలు చేయాలన్నారు. సీనియార్టీ ప్రకారం వేతనాలు చెల్లించాలి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించి 2022లో పరీక్ష రాసి పెండింగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మిగిలిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో శివలక్ష్మి శైలజ, హరిత ,కుషిబ్బి, రమణ బాయి, సువర్ణ ,పద్మ, వెంకట్ రవణమ్మ, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు భాస్కర్ రెడ్డి










