Nov 20,2023 19:42

ఆస్పరిలో మాట్లాడుతున్న రాధాకృష్ణ

ప్రజాశక్తి - ఆస్పరి
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం అంగన్వాడీలకు మద్దతుగా స్థానిక సచివాలయం దగ్గర సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌లో భాగంగా జీతంలో సగం పింఛను ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లించాలని, పేస్‌ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 8న చేపట్టే ధర్నాలో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సిడిపిఒ నిర్మలా దేవికి వినతిపత్రం అందజేశారు. వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు జ్యోతిలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్‌ విశ్వకుమారి, జానకి, ఎర్రమ్మ, విజయలక్ష్మి, రజిని, వెంకటలక్ష్మి, భార్గవి, పెద్దక్క పాల్గొన్నారు. ఆలూరు మండల సూపర్‌వైజర్‌ పద్మకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి, మండల నాయకులు షాకీర్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి జయశ్రీ, అంగన్వాడీ నాయకులు ప్రభావతి, లక్ష్మీ, సరస్వతి, సుజాతమ్మ, భారతి పాల్గొన్నారు.