ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో సిడిపిఓ కార్యాలయ పరిధిలోని 12 మంది అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్స్, మినీ అంగన్వాడి కార్యకర్తలకు సిడిపిఓ సుజాత అర్హత పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యాలయ పరిధిలో 14 పోస్టుల ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 12 సెంటర్లకు అభ్యర్థులను నియమించామని, రెండు సెంటర్లకు అభ్యర్థుల దరఖాస్తులు అసంపూర్తిగా ఉండడంతో నిలిపి వేసినట్లు తెలిపారు. కొత్తూరు, సుంకపూరు గ్రామాల అంగన్వాడి హెల్పర్లకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు పైల రమేష్, కొడవటిపూడి మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కుమార్ రాజా పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్ గా మంగ
ప్రజాశక్తి-రావికమతం:మండలంలో పిల్లవానిపాలెం అంగన్వాడి టీచర్‌గా దాసరి మంగ నియమితుల య్యారు. ఈ కేంద్రంలో పని చేస్తున్న టీచర్ గైర్హాజరు కావడంతో 18 నెలల తర్వాత ఖాళీ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు దాసరి మంగను నియమిస్తూ ఉత్తర్వులను బుధవారం స్థానిక ఐసిడిఎస్ జూనియర్ అసిస్టెంట్ జె మాతయ్య అందజేశారు.










