ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని, 25న చలో విజయవాడను జయప్రదం చేయాలని సిఐటియు డివిజన్ కార్యదర్శి బి.రాముడు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి బి.గోవర్ధనమ్మ, అర్బన్ కమిటీ కార్యదర్శి ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, జీతాలు పెంచుతామని పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నాలుగేళ్లు పూర్తయినప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. గ్రాట్యుటీ ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించాలని, అనవసరమైన యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న టిఎ, డిఎలను విడుదల చేయాలని కోరారు. పార్వతి, నాగలక్ష్మి, సుజాత, విజయలక్ష్మి పాల్గొన్నారు.
వినతి పత్రం అందిస్తున్న అంగన్వాడీలు










