ప్రజాశక్తి-కాకినాడ
ధరలు కనుగుణంగా కనీస వేతనం రూ.26 వే లు అంగన్‌వాడీలకి చెల్లించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి డిమాండ్ చేశారు. పెండింగ్‌లో పెట్టిన అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్‌డిఒ ఆఫీస్ పక్కన కాకినాడ అర్బన్, రూరల్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా అంగన్‌వాడీలకు వేతనం చెల్లిస్తానన్న సిఎం జగన్ రెడ్డి హామీ అమలు చేయాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం డిసెంబర్ 8వ తేదీ నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం జి.బేబిరాణి మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఒలను సైతం పక్కనపెట్టి నిబంధనలకు విరుద్డంగా కాకినాడ నగర ఎంఎల్‌ఎ వ్యవహరిస్తున్నారని విమర్శించారు రిలే దీక్షలను నిమ్మరసం ఇచ్చి కాకినాడ నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, జిల్లా కోశాధికారి మలకా రమణ విరమింపజేశారు. దీక్షలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడారు. ఒకరోజు రిలే దీక్షలలో ప్రాజెక్ట్ నాయకులు ఎంకే.జ్యోతి, ఎం.రాజేశ్వరి, వి.వీరవేణి, సిహెచ్ రమ, ఎండి సుఫియా బేగం, మున్నిరున్నిసా, వి.రమాదేవి, ఎంవిఎస్. నాగమణి తదితరులు దీక్షలలో పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి డిమాండ్
పెద్దాపురం అంగన్‌వాడీ వేతనాలు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని అంగనవాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రాపతి ప్రారంభించారు. అంగన్‌వాడీల నిరాహార దీక్షలకు సిఐటియు జిల్లా కార్యదర్శులు డి. క్రాంతి కుమార్, బాలం శ్రీనివాస్, మిడ్ డే మీల్ యూనియన్ నాయకులు కరక సుబ్బలక్ష్మి, ప్రజానాట్యమండలి నాయకులు కేదారి నాగు, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు టి.నాగమణి, అమలావతి, బి.ఎస్తేరురాణ తదితరులు పాల్గొన్నారు.
తాళ్లరేవు: ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మండల ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలను యూనియన్ నాయకులు వి.పద్మజ ప్రారంభించారు. యూనియన్ నాయకులు ఎన్. కృష్ణవేణి మాట్లాడారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, అత్తిలి బాబురావు, దుప్పి అదష్ట దీపుడు, ఎస్. కళావతి ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు.
కోటనందూరు అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తుని రూరల్ సిడిపిఒ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. వీరి మద్దతుగా సిపిఎం నాయకులు ఎస్కే పద్మ, నక్కల శ్రీనివాస్ , సిఐటియు నాయకులు బత్తిన నాగేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు.జగ్గంపేట రూరల్ సిఎం జగన్‌్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జగ్గంపేట లో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో డిసెంబర్ 8 నుండి సమ్మెకు వెళ్తామన్నారు. పి. సావిత్రి, సి రత్నం, జి. సుజాత, వైవి. రాజేశ్వరి, తదితరులు ఉన్నారు. పిఠాపురం అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ ప్రాజెక్టు కమిటీ ప్రధాన కార్యదర్శి డి.తులసి దేవి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కె.సత్యవతి, విజయ శాంత, నాగ గన్నిక, కమలా రాణి. రామలక్ష్మి, అన్నపూర్ణ, సూర్యకాంతం వెంకటలక్ష్మి, తదితరులు, గొల్లప్రోలు మండలం ఉప్పాడ కొత్తపల్లి మండలం సిఐటియు నాయకులు కెవి వి.సత్యనారాయణ, కె.నాగేశ్వరరావు, జి.వీరబాబు, నందీశ్వరుడు, కె.చిన్న పాల్గొని మద్దతు తెలిపారు.