ప్రజాశక్తి-జగ్గయ్యపేట
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చిల్లకల్లు ప్రాజెక్టు మహాసభ శనివారం కామ్రేడ్ టి. మధు కుమార్ అధ్యక్షత పట్టణంలోని సిఐటియు భవన్‌లో శనివారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్‌సిహెచ్ సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రేట్ టు సూపర్వైజర్ పోస్ట్లను వెంటనే భర్తీ చేయాలని బకాయి ఉన్న మెనూ చార్జీలు వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెనూ చార్జీలు ఒక నెల అడ్వాన్సుగా ఇస్తామని ప్రకటించిందని, కానీ నాలుగు నెలలు అవుతున్న ఇంతవరకు మెనూ చార్జీలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు అమలు చేయాలన్నారు. గ్యాస్ ధర 1200 రూపాయల అయిందని, ఈ గ్యాస్ బండ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. 2017 నుండి టిఎ, డిఎ బిల్లులు ఇవ్వట్లేదని వెంటనే డిఏ డిఏ బిల్లులు విడుదల చేయాలన్నారు. నాలుగు నెలలుగా మెనూ చార్జీలు ఇవ్వలేదని, 12వ తారీకు వచ్చిన అక్టోబర్ నెల జీతం ఇంకా ఇవ్వలేదని వెంటనే వేతనాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శిగా అంజమ్మ, టి మధుకుమారి, గౌరవ అధ్యక్షులుగా షేక్ గౌస్ మియా, 9 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ రామనాథం, అంగన్వాడీ వర్కర్లు, వెల్ఫేర్లు పాల్గొన్నారు.










