Oct 31,2022 22:51

ప్రజాశక్తి - తిరువూరు 

అంగన్వాడీ లకి కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని, పెన్షన్‌ తో కూడిన రిటై ర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియ న్‌(సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌. సిహెచ్‌. సుప్రజా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తిరువూ రు ప్రాజెక్ట్‌ మహాసభ స్థానిక సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరి గింది. ఈసందర్భంగా సుప్రజా మాట్లా డుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడి ఎస్‌ ను ప్రయివే టీకరణ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దాని లో భాగంగానే నూతన విద్యా విధానా న్ని ప్రవేశపెట్టి పిపి1, పిపి2 తీసుకు రావటమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమ పథకాలలో కోత విధిస్తోందని చెప్పారు. అంగన్వాడీలకు పర్మనెంట్‌ సూప ర్వై జర్‌ పోస్టులకు బదులు లింక్‌ సూపర్వై జర్ల పోస్టుల పేరుతో ఇన్‌ ఛార్జ్‌ బాధ్యతలు ఇచ్చేం దుకు ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లలో సీనియ ర్లుగా ఉన్నవాళ్లు ఈలింక్‌ సూపర్వైజర్ల పోస్ట్‌ కి అర్హులని పేర్లు సేకరిస్తున్నారని, దీనికారణంగా అంగ న్వాడీ వర్కర్‌ మూడు రోజులు సూప ర్వైజర్‌ గాను, మూడు రోజులు వర్కర్‌ గా పనిచేయాలని నిబంధనలు పెట్టిందని, దీనిని వ్యతిరే కించాలన్నారు. 20 13 నుండి అంగన్వాడీ వర్కర్లకు సూప ర్వైజర్‌ పోస్టులకు పదోన్నతి కలిపించ కుండా కాలయాపన చేసి సెప్టెంబర్‌18 వ తేదీన రాష్ట్రంలో సూపర్వైజర్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించిందని, దానిలో అవకతవకలు జరగటంతో కోర్టులో పిటీషన్‌ వేయటంతో నేటికీ తీర్పురాని పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. ఈస్థితిలో లింక్‌ సూపర్వైజర్‌ అనే పేరును తీసుకురావటం ఎంతవర కు భావ్యమని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ప్రాజెక్ట్‌ అధ్య క్షురాలుగా ఎం. పద్మావతి, కార్యదర్శి గా నాగమణి, సహాయ కార్యదర్శిగా జి. వెంకట్రావమ్మతో పాటు మరో 12 మంది కమిటీ సభ్యులుగా ఎన్నిక య్యారు. ఈ మహా సభలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎస్వీ. భద్రం, మండల కార్యదర్శి బి వెంకటేశ్వరరా వు, అధ్యక్షులు ఎ.రవి, ఎ.కొండూరు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వ రరావు, సిఐటియు తదితరులు పాల్గొన్నారు