Nov 06,2022 22:28

ప్రజాశక్తి-నందిగామ
అంగన్వాడీ కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ సుప్రజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నందిగామ 9వ ప్రాజెక్టు మహాసభ నందిగామ ఓసి క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభను ఉద్దేశించి ఎన్‌ సి హెచ్‌ సుప్రజా మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ తో కూడిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రేట్‌ టు సూపర్వైజర్‌ పోస్ట్లు పర్మినెంట్‌ చేయాలని అన్నారు. అంగనవాడీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడి వర్కర్‌ హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అంగన్వాడీలను పని భారం తగ్గించాలని సూచించారు. అనంతరం నందిగామ ప్రాజెక్టు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రాజెక్టు గౌరవాధ్యక్షులుగా కటారపు గోపాల్‌, నూతన కార్యదర్శిగా కోల్లి సరళ , కె సువర్చల అధ్యక్షులుగా, కోశాధికారిగా సునీత, కమిటీ సభ్యులుగా దుర్గా ,లక్ష్మి, వెంకట్రావమ్మ, లక్ష్మి, నాగమణి, వనిత, పిచ్చమ్మ ఎన్నికయ్యారు. ఈ మహాసభకు కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చనుమోలు సైదులు,వి.రవిశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి జి గోపి నాయక్‌, నాయకులు జక్కులూరి రవి తదితరులు పాల్గొన్నారు.