Aug 11,2023 23:46

అంగన్వాడీ మండల కమిటీతో సిఐటియు నాయకులు

దుగ్గిరాల: ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ (సిఐటియు)మంగళగిరి ప్రాజెక్ట్‌ గౌరవ అధ్యక్షులు వేముల దుర్గారావు అన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ అంగన్వాడీల కన్నా అదనంగా వెయ్యి రూపా యలు ఇస్తామని వాగ్దానం చేశారని, ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. అంగన్వాడీలకు అదనపు బాధ్యతలు అప్పగించారని, వారిపై వేధింపులు పెరిగాయని అన్నారు. అంగన్వాడీ సెంటర్లకు సకాలంలో అద్దెలు చెల్లిం చడం లేదన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేకుంటే పోరాటాలు ఉధ్రుతం చేస్తామన్నారు. సిఐటియు మండల నాయకులు జట్టి బాలరాజు మాట్లా డుతూ అంగన్వాడీలు హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరా డాలన్నారు .అనంతరం అంగన్వాడి మండల యూనియన్ను ఏర్పాటు చేశారు అధ్యక్షులుగా నాగమణి ప్రధాన కార్య దర్శిగా జయలతోపాటు తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో వై.బ్రహ్మేశ్వర పాల్గొన్నారు.