Jul 21,2023 23:22

మంగళగిరి: అంగన్వాడీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెర వేర్చాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు వేముల దుర్గారావు అన్నారు. శుక్రవారం మంగళగిరి సిఐటియు కార్యాలయంలో మంగళ గిరి ప్రాజెక్టు పరిధిలోని అంగ న్వాడీలు, ఆయాలతో విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూని యన్‌ నాయకురాలు హేమలత అధ్యక్ష వహించారు. దుర్గారావు తన ప్రసంగాన్ని కొన సాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలకు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన హామీని నెరవేర్చాలని అన్నారు. అదేవిధంగా అంగ న్వాడీలకు రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెలలో రెండు రోజులు పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు వద్ద ధర్నాలు నిర్వహించి నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. రానున్న కాలంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి సంఘ టితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వెట్టి చాకిరి చేస్తున్నప్పటికీ అంగన్వాడీలను గుర్తించడంలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ ఎస్‌ చం గయ్య, యూనియన్‌ నాయకురాలు సుహాసిని, విజయ లక్ష్మి, మేరీ, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌ పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడీి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మంగళగిరి పట్టణ, రూరల్‌ కమిటీలను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కమిటీకి గౌరవాధ్యక్షు లుగా వై.కమలాకర్‌, అధ్యక్షురాలుగా సిహెచ్‌ వినీల, కార్యదర్శిగా కె.హేమలత మరో 11 మందితో కమిటీ ఎన్నికయింది. అదేవిధంగా రూరల్‌ కమిటీ 9 మందితో ఎన్నికయింది. అధ్యక్షురాలుగా రుక్మిణి, కార్య దర్శిగా వై .కరుణకుమారి ఎన్నికయ్యారు.