Jul 19,2023 21:17

మాట్లాడుతున్న రామాంజులు

రాయచోటి టౌన్‌ : చిన్నమండెం, సంబేపల్లి మండల అంగన్వాడీ వర్కర్లకు గ్యాస్‌ స్టవ్‌లు ఇచ్చి సిలిం డర్లు ఇవ్వకపోతే పిల్లలకు, గర్బిణీలకు అన్నం ఎలావండి పెడతారని అధికార యంత్రాంగాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాం జులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాల ఆవరణలో రాయచోటి ప్రాజెక్టు కమిటీ సమావేశం యూనియన్‌ అధ్యక్షులు వి.సిద్దమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమా వేశంలో ప్రాజెక్టులోని వివిధ సెక్టార్లలోని అంగ న్వాడీ వర్కర్ల హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యల మీద చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరణ చేసే దిశలో భాగం గానే బడ్జెట్‌లో నిధులు తగ్గించాయన్నారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వర్కర్లకు వేతనాలు పనిముట్లు పరికరాలు ఇవ్వక పోవడం పిల్లలకు నాణ్యమైన ఫీడ్‌ ఇవ్వడం లేద న్నారు. ఐసిడిఎస్‌ పటిష్ట అమలుకు క్రియా శీలక పోరాటాలు చేయాలన్నారు. ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దేవపట్ల శెట్టిపల్లి సెక్టార్ల వర్కర్లకు హెల్పర్లకు మినీ వర్కర్లకు 2022 అక్టోబర్‌ జీతం ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. సిఎఫ్‌ఎంఎస్‌ పేరుతో 90 మంది వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న జీతం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమ స్యల పరిష్కారానికి ఈ 27, 28న మండల కేంద్రాల్లో 31న ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆం దోళన చేయాలని ప్రాజెక్టు కమిటీ ఏకగ్రీవ తీర్మా నం చేసిందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చేపట్టే ఆందోళన కార్యక్ర మాలను జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ మండల సెక్టార్‌ నాయకులు నాగమణి, విజయ అరుణ, సుమలత, శంకరమ్మ షబీనా, పీరమ్మ, రమణమ్మ, శైలజ, రెడ్డెమ్మ, అంజలి, జలజ ఉమా శ్రీదేవి, కవిత, కళావతి, జయ, పద్మజ షబానా, మాధవరం పద్మజ పాల్గొన్నారు.