మాచర్ల: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలో భాగంగా అంగన్వాడి టీచర్లకు, వర్కర్లకు అనేక వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాలని సిఐటియు డిమాండ్ చేసింది. స్థానిక సిఐటియు కార్యా లయంలో ఆదివారం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మాచర్ల డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. సమా వేేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా నాయకులు ఆంజనేయులు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అంగన్వాడీి వర్కర్స్ కి ఇచ్చే జీతాలు కంటే వెయ్యి రూపాయల అదనంగా ఇస్తానన్న జగన్, ఎక్కువ ఇవ్వకపోగా ఎన్నో ప్రయోజ నాలను రద్దు చేశారని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన మాట ప్రకారం వారి జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్‌లు మిగిలిన న్యాయపరమైన డిమాం డ్లను నెరవేర్చాలని కోరారు. గత రెండు దఫాలుగా ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు శివకుమారి, రుక్మిణి, పద్మ, సైదమ్మ పాల్గొన్నారు.










