Jun 16,2023 17:58

ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు

అంగన్‌వాడీలే పిల్లల ఎదుగుదలకు పునాదులు
ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ ప్రసూన


ప్రజాశక్తి - చిప్పగిరి

అంగన్వాడి కేంద్రాలే, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ ప్రసన్న అన్నారు. శుక్రవారం, మండల పరిధిలోని రామదుర్గం గ్రామంలోని అంగన్వాడి 1,2,3 కేంద్రాలలో టీచర్లు రామలక్ష్మి, జయమ్మ, శంకరమ్మల ఆధ్వర్యంలో జనభాగీదారి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కూడా అంగన్వాడి పాఠశాలలో ఆటపాటలతో కూడిన విద్య ప్రారంభమవుతుందని తెలిపారు. జనభాగీదారి కార్యక్రమమును రామదుర్గం గ్రామంలో ఘనంగా నిర్వహిం చారు. పిల్లల బాల్య దశలో మొదటి మూడు సంవత్సరాలు పరిమితమైన పిల్లలు ఆ తర్వాత బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. ఈ వయసులో అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు నచ్చే రీతిలో ఆట,పాట, కథల ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందించడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సత్ప్రవర్తనతో కూడిన విద్య అభ్యసించాలంటే చక్కగా పిల్లలను తీర్చిదిద్ది అంగన్వాడి పాఠశాల లో చేర్పించాలని పిల్లల గల తల్లిదండ్రులను కోరారు. ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అంగన్వాడి సర్టిఫికెట్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అంగన్వాడీ టీచర్లు రామలక్ష్మి, జయమ్మ, శంకరమ్మ, ఆయాలు చిట్టెమ్మ, తదితరులుపాల్గొన్నారు.