Nov 06,2023 00:23

సత్తెనపల్లి: అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి మరో పోరా టానికి సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) పల్నాడు జిల్లా కార్య దర్శి గుంటూరు మల్లేశ్వరి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పుతుంబాక భవన్‌ లో జరిగిన సత్తెనపల్లి ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ఎస్‌ .అహల్య అధ్య క్షత వహిం చారు. మల్లేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీి సెంటర్లకు ప్రభుత్వం ఇస్తున్న అరకొర బిల్లులలో పై అధికారులు పర్సంటేజీలు ఇవ్వమని డిమాండ్‌ చేయడం అన్యాయమని, ఈ పద్ధతులను వ్యతిరేకించాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్లకు ఫీడింగ్‌ లేకపోయినా ఫీడింగు తర్వాత ఇస్తా మని ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లలో పెట్టాలని డిమాండ్‌ చేయ డం సబబు కాదన్నారు. రాష్ట్రంలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లను అనేక జిల్లాలో వ్యతిరేకిస్తున్న పల్నాడు జిల్లాలో అధికారులు బలవంతంగా పనిచేయిస్తున్నారని చెప్పారు. ఇటీవల నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల్లోనూ, జగనన్న సురక్ష కార్యక్రమంలోనూ అంగన్వాడీలే ఖర్చులు భరిస్తూ చేత వంటలు చేయించి స్టాల్స్‌ పెట్టించడం, ఈవెంట్స్‌ చేయిం చిన విషయాన్ని ప్రస్తావించారు. అంగన్వాడీలకు వేత నాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ట్రెజరర్‌ ఎఎల్‌ ప్రసన్న పాల్గొన్నారు.