ప్రజాశక్తి - నిడమర్రు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించా లని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు క్యాంపు కార్యాలయంలో పిఎ రవికి వినతిని అందించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి.విజయలక్ష్మి మాట్లాడుతూ సిఎం జగన్ ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న వేతనాల కంటే అదనంగా ఇస్తానని చెప్పారని కానీ అమలు చేయ లేదన్నారు. ఫొటో సిస్టం రద్దు చేయాలని, అంగన్‌వాడీ సెంటర్లకు ట్యాబులు ఇవ్వాలని కోరారు. పని ఒత్తిడితో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు, యూనియన్ నాయకులు జాలాది సునీత, టి.వెంకటరమణ, షేక్ రసూల్, సిహెచ్.కుమారి, రాధిక, పివి.విల్సన్, అరుణ, సత్యవతి పాల్గొన్నారు.










