Jan 11,2023 21:31

ప్రజాశక్తి - వేలేరుపాడు
           అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు మండల అధ్యక్షులు సువ్వేటి లత ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి మడివి దుర్గారావు మాట్లాడుతూ సెంటర్ల తనిఖీల పేరుతో అధికారుల వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఫేస్‌ యాప్‌ అటిండెన్స్‌ను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర, జన్మకుమారి, చంద్రకాంత, సరస్వతి, సుజాత, శారద, చంద్రకళ, సుహాసిని పాల్గొన్నారు