Nov 20,2023 21:32

జమ్మలమడుగు : అంగన్వాడీలనుద్దేశించి మాట్లాడుతున్న మనోహర్‌

 జమ్మలమడుగు అంగన్వాడీ సమస్యలు పరిష్క రించాలని, వారిని పర్మినెంట్‌ చేసి రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి.మనోహర్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయంలో ధర్నా నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాక ముందు పాదయాత్రలో అంగన్వాడీ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడం దారుణం అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఫేస్‌ యాప్‌ను ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. వెంటనే రద్దు చేయాలని కోరారు. ఐసిడిఎస్‌కు నిధులు కేటా యించి పిల్లల అభివద్ధికి సహకరించాలన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌కు సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్‌ నిర్వహణకు ప్రతినెలా ఒక గ్యాస్‌ సిలిండర్‌ ప్రభుత్వమే సఫరా చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్ల గా మార్చాలని పేర్కొన్నారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. చివరగా ఐసిడిఎస్‌ జమ్మలమడుగు ప్రాజెక్టు కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లా డుతూ పిల్లల అభివద్ధి పథకానికి నిధులు సక్రమంగా కేటాయించకపోవడం వల్ల పోషకాహార లోపం కొనసాగుతుందన్నారు. అంగన్వాడీ విద్యను బలోపేతం చేసి వారికి యూనిఫారమ్‌ అమ్మఒడి, అమలు చేయాలన్నారు. ప్రభుత్వం తమ డిమా ండ్లను అంగీకరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చ రించారు. వచ్చే నెల 8న జరిగే నిరవధిక సమ్మెకు మద్దతు తెలపాని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు కె. లక్ష్మీదేవి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు విజరు కుమార్‌, సిఐటియు జమ్మల మడుగు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు విజరు, ఏసు దాసులు, అంగన్వాడీ వర్కర్స్‌ కమిటీ సభ్యులు హైమావతి, రమాదేవి, సుబ్బ నరసమ్మ, గంగాదేవి, రాజు, దివాకర్‌, ప్రసాద్‌ రెడ్డి, నాగరాజు పాలొ ్గన్నారు. పోరుమామిళ్ల :అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. బైవరప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు సిడిపిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సిడిపిఒకు సమ్మె నోటీసును అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ, పోరుమామిళ్ల ప్రాజెక్టు అధ్యక్షురాలు వినోదదేవి, టేకురుపేట, పోరుమామిళ్ల, కవలకుంట్ల, కలస పాడు, కాశినాయన సెక్టార్‌ లీడర్లు దస్తగిరమ్మ, రేణుకమ్మ, జ్యోతిమ్మ, విజయమ్మ, జోత్స్న, రమాదేవి, శ్రీదేవి, వాణి, ఫాతిమా రోశమ్మ రవణమ్మ, అంగ న్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాల యంలో సోమవారం అంగన్వాడీలు ధర్నా నిర్వహిం చారు. పులివెందుల అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షు రాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి సలీమా, మండల నాయకురాలు స్వప్న, కళ, మమత, శ్రీలత, జ్యోతి, సుధ, పద్మ, లక్ష్మీదేవి, సుజాత, అపర్ణ, వెంగ మ్మ, వెంకటలక్ష్మి, బిందు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : అంగన్వాడీ సమస్యలు పరి ష్కరించాలని స్థానిక రూరల్‌ ఐసిడిఎస్‌ కార్యాల యం ఎదుట సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనా రాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్ర మంలో ధర్నాలో అంగన్వాడీ అధ్యక్షురాలు రాణి, గీత, సువార్తమ్మ, నాగలక్ష్మి, సునీత అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్క రించాలని డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డిఎం ఓబులేసు డిమాండ్‌ చేశారు. సోమవారం కడప రూరల్‌ సిడిపఒ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ల ఆందోళనకు డివైఎఫ్‌ఐగా సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకురాలు నాగలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నాయకులు సంటేమ్మ, సావిత్రి, కష్ణవేణి, పద్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.